రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి మృతి

Road Accident at Rangareddy district.రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 28 Feb 2021 10:39 AM IST

Road Accident at Rangareddy district

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం హైదరాబాద్‌-బెంగళూరు జాతియ రహదారిపై అదుపు త‌ప్పిన కారు డివైడ‌ర్‌పై నుంచి దూసుకువెళ్లి లారీని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రొకరికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల‌ను మ‌ల‌క్‌పేట వాసులుగా గుర్తించారు. అతి వేగమే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.




Next Story