ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన కారు
Road accident at Nandigama.గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి మండలం
By తోట వంశీ కుమార్ Published on
24 April 2021 2:44 AM GMT

గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీలతో వెలుతున్న ఆటోను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story