ఆగి ఉన్న‌లారీని ఢీ కొట్టిన ఆటో ట్రాలీ.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

Road Accident at Bibinagar Toll Gate Two dead.ఆగి ఉన్న లారీని ఆటో ట్రాలీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2022 10:09 AM IST
ఆగి ఉన్న‌లారీని ఢీ కొట్టిన ఆటో ట్రాలీ.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

ఆగి ఉన్న లారీని ఆటో ట్రాలీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా బీబీన‌గ‌ర్ టోల్‌గేట్ స‌మీపంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. పూల లోడుతో వెలుతున్న ఆటో ట్రాలీ శ‌నివారం తెల్ల‌వారుజామున బీబీన‌గ‌ర్ టోల్ గేట్ స‌మీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆటో ట్రాలీలో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంది. ప్ర‌మాదం ధాటికి ట్రాలీ ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ట్రాలీలో చిక్కుకున్న మృత‌దేహాల‌ను తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను ప‌ర్వ‌త‌గిరి మండ‌లం తోట‌ప‌ల్లికి చెందిన అనిల్‌, వ‌రంగ‌ల్‌కు చెందిన ఖ‌లీల్‌గా గుర్తించారు.

ఇక అదే స‌మ‌యంలో పాలకుర్తి నియోజకవర్గానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెలుతున్నారు. ప్ర‌మాద విష‌యాన్ని తెలుసుకున్న మంత్రి అక్క‌డ ఆగారు. ద‌గ్గ‌రుండి స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబీల‌తో మాట్లాడి వారిని ఓదార్చ‌డంతో పాటు సంతాపం తెలియ‌జేశారు. రోడ్డు ప్ర‌యాణంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి సూచించారు.

Next Story