అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి
Road Accident at Abdullapurmet.హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఆగి
By తోట వంశీ కుమార్ Published on
8 May 2021 1:50 AM GMT

హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని స్విప్ట్ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన భార్య ఝూన్సీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి ఆ దంపతుల 8 ఏళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు. వీరు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో ఝూన్సీ కారు నడుపుతున్నట్లు గుర్తించారు.
Next Story