ఇదేం పాడుబుద్ధి.. ఆవుతో అస‌హ‌జ శృంగారం

Retired assistant director arrested for unnatural sex with cow.మానవత్వానికి మాయని మచ్చ ఇది. సమాజం తల దించుకోవాల్సిన ఘటన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2022 10:08 AM IST
ఇదేం పాడుబుద్ధి.. ఆవుతో అస‌హ‌జ శృంగారం

మానవత్వానికి మాయని మచ్చ ఇది. సమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది. చిన్నారుల‌ నుంచి పండు ముసలి వాళ్లపై అఘాయిత్యాల‌కు పాల్పడుతున్న కామాంధులు..ఆఖ‌రికి మూగ జీవాలను కూడా వదలడం లేదు. తాజాగా.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఆవుతో శృంగారం చేసి పశువులా ప్రవర్తించాడు. ఈ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. రాజాం రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కంచ‌రాం గ్రామంలో రామ‌కృష్ణ(62) అనే వ్య‌క్తి నివ‌సిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అత‌డు ఆవుతో అస‌హ‌జ శృంగారంలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై ఐపిసి సెక్షన్ 377 మరియు జంతువుపై క్రూరత్వానికి సంబంధించిన ఇతర సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘాతుకానికి పాల్ప‌డింది కంచ‌రాం గ్రామంలో నివ‌సించే రామ‌కృష్ణ‌గా గుర్తించి పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. అత‌డు ఎపి ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా రిటైర్ అయ్యాడ‌ని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఆవులు, పెంపుడు కుక్కలతో అసహజ సంభోగానికి పాల్పడుతున్నాడని విచారణలో తేలింది. ఈ విషయం నిందితుడి బంధువులకు తెలిసి వారు అత‌డికి దూరంగా ఉంటున్నారు. "రామకృష్ణ భౌతికంగా, మానసికంగా బాగున్నట్లు గమనించాం. కానీ అతని అసహజ ప్రవర్తనకు సరైన కారణం ఏమిటో మాకు తెలియదు'' అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి నవీన్ కుమార్ తెలిపారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Next Story