Hyderabad: ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు.. అరెస్ట్‌

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ప్రియురాలిమీద కత్తితో దాడి చేశాడు.

By అంజి
Published on : 25 July 2023 7:07 AM IST

Relative attacks woman, Uppal, Crimenews

Hyderabad: ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు.. అరెస్ట్‌ 

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ప్రియురాలిమీద కత్తితో దాడి చేశాడు. తన ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఉప్పల్‌లోని రామంతపూర్‌కు చెందిన యువతిని వరుసకి బావ అయినా లక్ష్మీనారాయణ ప్రేమించాడు. గత కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. విభేదాలు రావడంతో మాట్లాడుదామని లక్ష్మీనారాయణ యువతికి చెప్పాడు. నిన్న సాయంత్రం సమయంలో ఏదో సాకు చెప్పి లక్ష్మీ నారాయణ యువతిని బయటకు తీసుకెళ్లాడు. వారిద్దరి మధ్య ఏదో సమస్యపై వాగ్వాదం జరిగింది.

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద ఘర్షణగా మారడంతో ఆగ్రహానికి లోనైన లక్ష్మీనారాయణ ఒక్కసారిగా యువతిపై దాడి చేసి కత్తితో గొంతు కోసి అక్కడ నుండి పారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే బంధువులు ఘటన స్థలానికి చేరుకొని యువతిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. లక్ష్మీనారాయణ తనను పెళ్లి చేసుకోవాలని యువతిని బలవంతం చేశాడని పోలీసులు తెలిపారు.

Next Story