వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన అత్యాచార బాధితురాలు.. రేపిస్టును అరెస్ట్ చేయాలని..

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదును అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు తీవ్ర చర్య తీసుకుంది.

By అంజి  Published on  13 Feb 2024 6:53 AM IST
Rape survivor, Rajasthan, water tank,rapist arrest

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన అత్యాచార బాధితురాలు.. రేపిస్టును అరెస్ట్ చేయాలని.. 

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో అత్యాచార బాధితురాలు తన ఫిర్యాదును అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు తీవ్ర చర్య తీసుకుంది. తనపై అత్యాచారం జరిపిన నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా అరెస్ట్ చేయలేదని ఆ మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిపై నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

ఆమె మెజిస్ట్రేట్‌తో తన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. నెల రోజులు కావొస్తున్నా పోలీసులు నిందితుడిని పట్టుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను కిందికి దింపారు. ఆమె ఆందోళన విన్న పోలీసులు ఆమెకు నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో, మహిళ వాటర్ ట్యాంక్ దిగింది.

Next Story