దారుణం: కదులుతోన్న కారులో అత్యాచారం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు యువకులు కిడ్నాప్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  20 July 2024 3:59 PM IST
rape,  minor girl,  madhya pradesh, crime ,

దారుణం: కదులుతోన్న కారులో అత్యాచారం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు యువకులు కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. కదులుతున్న కారులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సమయంలో వీడియో రికార్డు చేసి బాలికను వేధించసాగారు. 13 ఏళ్ల బాలిక గ్వాలియర్‌ జిల్లాలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు ఏడాది కిందట చినూర్‌కు చెందిన ఓ యువకుడితో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతను తన ఇద్దరు స్నేహితులను బాలికకు పరిచయం చేశాడు. వీరంతా రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో చాట్ చేసుకునేవారు.

ఇటీవల బాలిక స్నేహితుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వచ్చారు. ఆమెను పిలిచి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. ఒకరు కారు డ్రైవ్ చేస్తుంటే.. వెనుక సీటులో ఉన్న బాలికపై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. డ్రైవర్ పక్కసీట్లో ఉన్న వ్యక్తి ఇదంతా మొబైల్‌లో రికార్డు చేశాడు. ఆ వీడియోను నిందితుడు బాలికకు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని అన్నాడు. ఆమె మాట వినలేదు. దాంతో వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

ఈ క్రమంలోనే బాదిత బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వారితో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు మరో స్నేహితడిని అరెస్ట్ చేశారు. కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మరో యువకుడు ఉన్నాడనీ..అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులు 18 నుంచి 20 ఏళ్ల వయసు వారని పోలీసులు చెబుతున్నారు.

Next Story