తెలంగాణలో దారుణం.. కన్నతల్లిని చంపిన కొడుకు

రంగారెడ్డి జిల్లా పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కొడుకు మద్యం మత్తులో తన తల్లిని హతమార్చాడు.

By -  అంజి
Published on : 21 Sept 2025 12:45 PM IST

Ranga Reddy, Son kills mother, Chevella, Crime

తెలంగాణలో దారుణం.. కన్నతల్లిని చంపిన కొడుకు    

రంగారెడ్డి జిల్లా పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కొడుకు మద్యం మత్తులో తన తల్లిని హతమార్చాడు. చేవెళ్ల మండలం రేగడి ఘన్‌పూర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. 42 ఏళ్ల జంగయ్య అనే ఆ వ్యక్తి తన తల్లి నర్సమ్మ (75)ను చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి, జంగయ్య మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన తల్లితో గొడవపడ్డాడు.

ఆ తర్వాత ఇంట్లో ఉన్న కొడవలితో పదే పదే దాడి చేశాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన మహిళను గమనించిన గ్రామస్తులు జంగయ్యను పట్టుకుని స్తంభానికి కట్టేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అతన్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story