రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. నడిరోడ్డుపై మహిళ బట్టలు విప్పి..

మణిపూర్‌లో జరిగిన సంఘటన మర్చిపోక ముందుకే.. ఓ మందు బాబు రంగారెడ్డి జిల్లాలో ఓ యువతిని నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన పలువురిని భయభ్రాంతులకు గురి చేసింది.

By అంజి  Published on  7 Aug 2023 9:50 AM IST
Ranga Reddy district, drunk man, Crime news

రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. నడిరోడ్డుపై మహిళ బట్టలు విప్పి..

మణిపూర్‌లో జరిగిన సంఘటన మర్చిపోక ముందుకే.. ఓ మందు బాబు రంగారెడ్డి జిల్లాలో ఓ యువతిని నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన పలువురిని భయభ్రాంతులకు గురి చేసింది. ఓ మందు బాబు రోడ్డుపై వీరంగం సృష్టిస్తూ ఓ యువతి వస్త్రాలను విప్పి వివస్త్రను చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేగింది. పెద్ద మారయ్య (30) అనే వ్యక్తి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను పీకల దాకా మద్యం సేవించి నిన్న అర్ధరాత్రి సమయంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ బస్ స్టాప్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న ఒక యువతి (28)పై ఒక్కసారిగా దాడి చేసి ఆమె బట్టలను మొత్తం చింపేసి వివస్త్రను చేశాడు.

అది చూసిన మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ మహిళపై కూడా దాడి చేయబోయాడు. మహిళ బట్టలు విప్పి ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై నిలబెట్టి నానా రచ్చ సృష్టించాడు. అక్కడున్న పలువురు ఏం చేయాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉండిపోయారు. 15 నిమిషాల పాటు ఆ యువతి రోడ్డు మీద నగ్నంగా ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు ఆ కీచకుడు మారయ్య అక్కడినుండి వెళ్ళిపోయాక పలువురు వెళ్లి ఆ యువతిపై కవర్లు కప్పి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి మారయ్యను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story