ఏడాది కాలంగా బంధువు అత్యాచారం.. స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక
Rajasthan minor delivers child in school toilet cousin booked for raping her. రాజస్థాన్‌లోని కోటాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జనావాసాలు లేని బహిరంగ ప్రదేశంలో ఒక పసికందు పడి ఉంది.
By అంజి Published on 28 Nov 2022 8:14 AM GMTరాజస్థాన్‌లోని కోటాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జనావాసాలు లేని బహిరంగ ప్రదేశంలో ఒక పసికందు పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు పసికందును రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు 15 ఏళ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చి నిర్జన ప్రాంతంలో పడేసినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు బాలికను పట్టుకుని విచారణ చేపట్టారు. విచారణలో.. ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని మరుగుదొడ్డిలో బిడ్డకు జన్మనిచ్చి నిర్జన ప్రాంతంలో పడేసినట్లు ఆమె అంగీకరించింది.
ఇది విని షాక్‌కు గురైన పోలీసులు బాలికను మరింత లోతుగా విచారించారు. ఆ సమయంలో షాకింగ్ సమాచారం బయటపడింది. బాలిక గత ఏడాది కాలంగా అప్పుడప్పుడు అమ్మమ్మ ఊరికి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అమ్మమ్మ ఊరికి చెందిన 21 ఏళ్ల అబ్బాయి, ఆ అమ్మాయి స్నేహితులుగా మారారు. అమ్మమ్మ ఊరికి వెళ్లినప్పుడల్లా యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. గత ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు గురై గర్భం దాల్చిన బాలిక గత శనివారం ప్రసవ వేదనకు గురైంది.
ఆ తర్వాత గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టాయిలెట్‌లో బాలిక ప్రసవించింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని భావించిన బాలిక.. పసికందును నిర్జన ప్రాంతంలో వదిలి వెళ్లిందని విచారణలో తేలింది. దీంతో బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన 21 ఏళ్ల యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు గ్రామానికి వెళ్లారు. అయితే పోలీసులు వచ్చేలోపే యువకుడు పారిపోయాడు. పరారీలో ఉన్న యువకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలికకు జన్మనిచ్చిన పాప ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
15 ఏళ్ల బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు పరారీలో ఉన్న 21 ఏళ్ల యువకుడిపై IPC సెక్షన్ 376 (రేప్) మరియు POCSO చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. బండి సదర్ పోలీస్ స్టేషన్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) అరవింద్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు, మైనర్ బాలిక బంధువులని, అతను గత 10-11 నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని చెప్పాడు. నవజాత శిశువు ప్రస్తుతం ఆక్సిజన్ మరియు వాసోప్రెసర్ సపోర్ట్‌తో ఉందని, రాబోయే 48 గంటలు ఆమెకు చాలా కీలకం అని కోటలోని జే కే లోన్ ఆసుపత్రికి చెందిన ఆశుతోష్ శర్మ చెప్పారు.