దారుణం.. భార్య‌ను చంపి.. న‌డివీధిలో ఈడ్చుకెళ్లాడు

Rajasthan Man Kills Wife Drags Body On Road.వారిద్ద‌రి మ‌ధ్య మొద‌లైన చిన్న గొడ‌వ కాస్త పెద్ద‌దిగా మారిపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2021 7:28 AM IST
దారుణం.. భార్య‌ను చంపి.. న‌డివీధిలో ఈడ్చుకెళ్లాడు

వారిద్ద‌రి మ‌ధ్య మొద‌లైన చిన్న గొడ‌వ కాస్త పెద్ద‌దిగా మారిపోయింది. భ‌ర్తలో ఆగ్ర‌హాం క‌ట్ట‌లు తెంచుకుంది. అంతే.. ఇంకా ఏమీ ఆలోచించ‌కుండా ప‌క్క‌నే ఉన్న గొడ్డ‌లితో భార్య‌ను న‌రికి చంపేశాడు. అయినా.. అత‌డి కోపం ఇంకా చ‌ల్లార‌లేదు. భార్య శ‌వాన్ని న‌డి వీధులో 80 మీట‌ర్ల దూరం వ‌రకూ ఈడ్చుకెళ్లాడు. భార్య భ‌ర్త‌ల గొడ‌వ‌లో 9 నెల‌ల చిన్నారికి గాయాల‌య్యాయి. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ దారుణ‌ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రామ్‌పుర ప‌రిధిలోని భాతాపుర‌లో సునీల్ వాల్మీకి అలియాస్ పింటూ(40) త‌న భార్య సీమ‌(35), కుమారుడు అవినాష్‌(9 నెల‌లు) తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. పింటూ కూలి ప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నాం సోద‌రుడి ఇంటిలో ఉన్న సీమ‌, కుమారుడిని ఇంటికి తీసుకెళ్లాడు. సాయంత్రం ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగింది. దీంతో ఆగ్ర‌హించిన పింటూ గొడ్డ‌లితో సీమను న‌రికివేశాడు.

దీంతో ఆమె అక్క‌డిక్క‌డే మృతి చెందింది. అయిన‌ప్ప‌టికి అత‌డి కోపం చ‌ల్లార‌లేదు. భార్య మృత‌దేహాన్ని వీధిలో 80 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ఈడ్చుకెళ్లి అక్క‌డ ప‌డేశాడు. ఈ ఘ‌ట‌న‌ను చూసిన స్థానికులు భ‌య‌బాంత్రుల‌కు గురైయ్యారు. భార్య భ‌ర్త‌ల గొడ‌వ‌లో చిన్నారి అవినాష్ కు తీవ్ర‌గాయాల‌య్యాయి. స్థానికులు ఆ బాలుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ బుధ‌వారం ఉద‌యం మ‌ర‌ణించాడు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పింటూ పై ఇప్ప‌టికే అత్యాచారం, దాడితో క‌లిసి మొత్తం 5 కేసులున్న‌ట్లు చెప్పారు.

Next Story