రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చేసిన పనికి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు దళిత ఎలక్ట్రీషియన్‌ను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టి మూత్రం తాగించారు. ఆ తర్వాత చెప్పులతో కూడిన దండను మెడలో అవమానించారని పోలీసులు తెలిపారు. దాడిని ఆపమని ఆ వ్యక్తి వారిని వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు. అలాగే దాడి చేసిన వారిలో ఒకరు వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ వీడియోను దాడి చేసిన వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
''నవంబర్ 23న ముగ్గురు వ్యక్తులపై భరత్ కుమార్ (38) ఫిర్యాదు చేశారు. భరత్ కుమార్ ఓ వ్యక్తి దగ్గర ఎలక్ట్రికల్ పని చేశాడు. అందుకు రూ. 21,100 బిల్లు అయ్యిందని చెప్పాడు. అయితే అతనికి రూ.5వేలు చెల్లించారు. నవంబర్ 19న మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని అడిగేందుకు మధ్యాహ్నం ఓ దాబా వద్దకు వెళ్లాడు. అయితే సదరు వ్యక్తి రాత్రి 9 గంటలకు రావాలని చెప్పారు. రాత్రి 9:10 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లే సరికి డబ్బులు చెల్లించకుండా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో, నిందితులు అతనిని ఇతరులతో పాటు పట్టుకుని కొట్టారు. కుమార్‌ను కొడుతున్నప్పుడు, వారు అతని మెడలో బూట్ల దండను వేశారు. వారిలో ఒకరు వీడియోలు చేసి, ఆపై వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేశారు. వారు దాదాపు ఐదు గంటల పాటు అతనిపై దాడి చేశారు'' అని సిరోహి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) దినేష్ కుమార్ అన్నారు.