ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తనకు ఆహారం అందించడంలో జాప్యం చేసిందన్న ఆరోపణతో ఓ వ్యక్తి తన భార్యను బుధవారం వారి ఇంటి రెండవ అంతస్తు నుండి తోసేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ నగర్‌కు చెందిన సునీల్ జగ్బంధు అనే వ్యక్తి తన భార్య సప్నను తనకు ఆహారం అందించమని అడిగాడు. అయితే, ఆమె తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తుండడంతో అతనికి ఆహారం పెట్టడంలో జాప్యం చేసింది. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో జగబంధు తన భార్యను ఇంటి రెండో అంతస్తు నుంచి తోసేశాడు.
గుధియారి పోలీసులు గృహహింస కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సప్నా పరిస్థితి విషమంగా ఉంది. రాయ్‌పూర్‌లోని డికె సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చబడింది.