కలకలం.. ఎక్స్‌పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి

పంజాబ్‌లోని పాటియాలాలోని ఓ కిరాణా దుకాణంలో కొన్న చాక్లెట్‌లు తినడంతో ఏడాదిన్నర వయసున్న బాలిక రక్త వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైంది.

By అంజి  Published on  21 April 2024 7:39 AM IST
Punjab ,   blood vomits, expired chocolates, Crime

కలకలం.. ఎక్స్‌పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి 

పంజాబ్‌లోని పాటియాలాలోని ఓ కిరాణా దుకాణంలో కొన్న చాక్లెట్‌లు తినడంతో ఏడాదిన్నర వయసున్న బాలిక రక్త వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైంది. అయితే ఆ చాక్లెట్లు కాలం చెల్లినవి అని తిన్న తర్వాత తెలిసింది. పోలీసులు, ఆరోగ్య శాఖ జరిపిన విచారణలో చాక్లెట్ల గడువు ముగిసినట్లు తేలింది. లూథియానాకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పాటియాలాలో బంధువుల ఇంటికి వెళ్లింది. బంధువు, విక్కీ గెహ్లాట్, స్థానిక కిరాణా దుకాణం నుండి బాలిక కోసం చాక్లెట్ల పెట్టెను కొనుగోలు చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ చాక్లెట్లు తిన్న బాలిక నోటి నుంచి రక్తం కారుతోంది. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించగా విషపదార్థం తిని అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు.

దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు, రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. ఆరోగ్య అధికారుల బృందం ఫిర్యాదుదారుతో పాటు కిరాణా దుకాణానికి చేరుకుని నమూనాలను సేకరించింది. దుకాణంలో గడువు ముగిసిన తినుబండారాలు విక్రయించినట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దుకాణంలో గడువు ముగిసిన ఇతర చిరుతిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై విచారణ జరుగుతోంది. గత నెల, పంజాబ్‌లోని పాటియాలాలో 10 ఏళ్ల బాలిక తన పుట్టినరోజున కేక్ తిని అనుమానాస్పద ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించింది. ఆమె కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యారు కానీ ప్రాణాలతో బయటపడ్డారు. కుటుంబ సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖను ఆశ్రయించారు. ఆ తర్వాత కేక్ ఆర్డర్ చేసిన బేకరీ రిజిస్టర్ కాలేదని, నకిలీ పేరుతో నడుస్తున్నట్లు తేలింది. ఆర్డర్ చేసిన కేక్ పాతదని కూడా గుర్తించారు.

Next Story