పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దెయ్యాన్ని వదిలిస్తామని చెప్పి 30 ఏళ్ల వ్యక్తిని పాస్టర్, అతని సహచరులు కొట్టి చంపారు. దీంతో పాస్టర్, అతని ఎనిమిది మంది సహచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు సామ్యూల్ మాసిహ్ రోజువారీ కూలీ, మూర్ఛలతో బాధపడుతున్నట్లు తెలిసింది. అతని పరిస్థితిపై ఆందోళన చెందిన శామ్యూల్ కుటుంబం బుధవారం శామ్యూల్ కోసం ప్రార్థన నిర్వహించడానికి పాస్టర్ జాకబ్ మాసిహ్‌ను తమ ఇంటికి పిలిపించిందని పోలీసులు తెలిపారు.
శామ్యూల్‌కు దెయ్యం పట్టిందని పాస్టర్ పేర్కొన్నాడు. తన ట్రీట్మెంట్‌తో అతని శరీరం నుండి "చెడు బలవంతంగా దూరంగా పోతుంది" అని అతని కుటుంబానికి తెలియజేశాడు. శామ్యూల్ కుటుంబీకుల కథనం ప్రకారం.. పాస్టర్, అతని సహచరులు అతనిపై దారుణంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అతను మంచం మీద పడి మరణించినట్టు అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. శామ్యూల్‌ను కుటుంబీకులు పాతిపెట్టారు. వారు పాస్టర్‌పై ఫిర్యాదు చేశారు.
శనివారం డ్యూటీ మేజిస్ట్రేట్ ఇందర్‌జిత్ కౌర్ నేతృత్వంలో పోలీసులు శామ్యూల్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జాకబ్ మసీహ్, బల్జీత్ సింగ్ సోనూ తదితరులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.