ప్రియురాలి పసిబిడ్డను వేడినీటిలో ముంచి హత్య
మహారాష్ట్రలోని పూణేలో ఒక వ్యక్తి తన ప్రియురాలలి పసిబిడ్డ కొడుకును వేడినీటి బకెట్‌లో ముంచి చంపాడనే ఆరోపణలపై
By అంజి Published on 25 April 2023 8:30 AM ISTప్రియురాలి పసిబిడ్డను వేడినీటిలో ముంచి హత్య
మహారాష్ట్రలోని పూణేలో ఒక వ్యక్తి తన ప్రియురాలలి పసిబిడ్డ కొడుకును వేడినీటి బకెట్‌లో ముంచి చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితుడు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. పసిబిడ్డ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఖేడ్‌కు చెందిన విక్రమ్ శరద్ కొలేకర్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 6 ఉదయం, విక్రమ్ శరద్ కొలేకర్ ఖేడ్‌లోని మహిళ ఇంటికి వెళ్లి పసిబిడ్డను ఎత్తుకుని వేడినీటిలో ముంచాడు. మహిళ బయటకు వెళ్లి చిన్నారిని నిందితుడి సంరక్షణలో ఉంచిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పసిబిడ్డ శరీరమంతా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఏప్రిల్ 6న శిశువును చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు, కానీ 15 రోజుల తరువాత మరణించింది.
భర్తతో విడివిడిగా ఉంటున్న మహిళ.. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో విక్రమ్ ఈ హత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మహిళ, ఆమె సోదరికి హాని చేస్తానని బెదిరించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.