శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. 12 మందికి గాయాలు

Private Travel Bus accident in Srikakulam.శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అదుపు త‌ప్పిన బ‌స్సు ఢీవైడ‌ర్‌ ఢీ కొట్టింది. 12 మందికి గాయాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2021 10:48 AM IST
Private Travel Bus accident in Srikakulam

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అదుపు త‌ప్పిన బ‌స్సు ఢీవైడ‌ర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది గాయ‌పడ్డారు. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వివ‌రాల్లోకి వెళితే.. విశాఖ‌ప‌ట్నం నుంచి ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌కు వెలుతున్న ప్రైవేటు ట్రావెల్ బ‌స్సు ఇచ్చాపురం టోల్‌ప్లాజా వ‌ద్దకు రాగానే అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. ఈఘ‌ట‌న‌లో న‌లుగురికి తీవ్ర‌గాయాలు కాగా.. మ‌రో ఎనిమిది మందికి స్వ‌ల్ప‌గాయాలు అయ్యాయి.

వెంట‌నే స్థానికులు గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఇచ్చాఫురం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప్రాధ‌మిక చికిత్స అనంత‌రం మెరుగైన చికిత్స కోసం ఒడిశాలోని బ్ర‌హ్మ‌పుర వైద్య క‌ళాశాల‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాధ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. గాయ‌ప‌డిన వారంతా ఒడిశాకు చెందిన వారేన‌ని తెలిపారు.


Next Story