ఘోరం..లోయ‌లో ప‌డిపోయిన కారు.. 8 మంది మృతి

Private cab falls into gorge in Jammu and Kashmir's Kishtwar.జ‌మ్ము క‌శ్మీర్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2022 7:53 AM IST
ఘోరం..లోయ‌లో ప‌డిపోయిన కారు.. 8 మంది మృతి

జ‌మ్ము క‌శ్మీర్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓ క్యాబ్ అదుపుతప్పి లోయలో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది ప్రయాణికులు మ‌ర‌ణించారు. బుధ‌వారం సాయంత్రం కిష్ట్వర్ జిల్లాలో ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నార‌ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కిష్ట్వర్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ క్యాబ్‌లో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని, వారంతా ప్రమాదంలో మరణించారని ప్రాథమిక సమాచారం అందించిందని తెలిపారు. ఎనిమిది మృత‌దేహాలు స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు.

లోయ‌లో క్యాబ్ ప‌డిపోవ‌డంతో మృత‌దేహాల‌ను పైకి తీసుకువ‌చ్చేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. మృతుల్లో ఏడుగురు మ‌ర్వా ప్రాంతానికి చెందిన వారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం క‌మ్యూనిటీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతులను క్యాబ్ డ్రైవర్ ఉమర్ గని, మహ్మద్ అమీన్, మహ్మద్ ఇర్ఫాన్, అఫాక్ అహ్మద్, సఫూరా బానో, ముజాములా బానో, ఆసియా బానో, మొహసినా బానోగా గుర్తించారు.

Next Story