తాడిమళ్లలో పూజారి దారుణ హత్య
Priest Brutally Murdered in West Godavari District.పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయం
By తోట వంశీ కుమార్ Published on
22 March 2022 8:21 AM GMT

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయం ఆవరణలోనే పూజారీని దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలోని శివాలయంలో కొత్తలంక శివనాగేశ్వరరావు అర్చకుడిగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి ఆయన ఇంటికి రాకవడంతో ఆయన భార్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు గుడి వద్దకు రాగా.. పూజారీ ఉపయోగించే వాహనం అక్కడ కనబడకపోవడంతో వారు తిరిగి వెళ్లిపోయారు.
శివనాగేశ్వరరావు కు సంబంధించిన పొలం వద్దకు వెళ్లి ఉంటారని అక్కడకు వెళ్లి చూడగా.. అక్కడ కనిపించలేదు. దీంతో ఏదైనా పని నిమిత్తం వేరే ఊరు వెళ్లి ఉంటారని బావించారు. కాగా.. మంగళవారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో ఆయన మృతదేహం ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story