త‌ర‌చూ కోరిక తీర్చాల‌ని గ‌ర్భిణిని బ‌ల‌వంతం చేసిన భ‌ర్త.. విష‌మిచ్చి చంపిన భార్య‌

Pregnant woman kills husband for insisting on sex.ఏడు నెల‌ల క్రితం వివాహం అయింది. ప్ర‌స్తుతం భార్య ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి, భ‌ర్త త‌ర‌చూ కోరిక తీర్చ‌మని వేదిస్తుండ‌డంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2021 1:31 PM IST
Pregnant woman kills husband for insisting on sex

ఏడు నెల‌ల క్రితం వివాహం అయింది. ప్ర‌స్తుతం భార్య ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. అయితే.. భ‌ర్త త‌ర‌చూ కోరిక తీర్చ‌మని వేదిస్తుండ‌డంతో భార్య విసిగిపోయింది. ఈ క్ర‌మంలో ఆమె అనారోగ్యం పాలైంది. అయినప్ప‌టికి భ‌ర్త కోరిక తీర్చ‌మ‌ని వేదిస్తుండ‌డంతో.. చివ‌రి అత‌డికి విషం ఇచ్చి చంపేసింది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. ఈరోడ్ జిల్లా అందియూర్‌కు చెందిన నంద‌కుమార్‌(35)కు ఏడు నెలల క్రితం మైథిలీ అనే యువతితో పెళ్లి జ‌రిగింది. ప్ర‌స్తుతం మైథిలీ ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి.

ఇటీవల నంద కుమార్ కడుపు నొప్పి, విరేచనాలతో ఆస్పత్రిలో చేరాడు. అత‌డిని ప‌రీక్షించిన వైద్యులు అత‌డి ర‌క్తంలో విషం క‌లిసిన‌ట్లు గుర్తించారు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో.. న్యాయ‌మైర్తి నంద‌కుమార్ వ‌ద్ద వాంగ్యూలం తీసుకున్నాడు. జ‌న‌వ‌రి 28న తాను ఇంట్లోనే భోజ‌నం చేశాన‌ని.. ఆ స‌మ‌యంలో చేదుగా అనిపించింద‌ని చెప్పాడు. ఎందుకు ఇలా ఉంద‌ని త‌న భార్య మైథిలీని అడ‌గ‌గా.. ఏమీ లేద‌ని ఆమె చెప్ప‌డంతో.. అలాగే మొత్తం తిన్నాన‌ని చెప్పాడు. అనంత‌రం క‌డుపులో నొప్పిగా ఉండ‌డంతో ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యాన‌ని తెలిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 15న కన్నుమూశాడు.

కేసు న‌మోదు చేసిన పోలీసులు మైథిలిని ప్ర‌శ్నించ‌గా.. ఐదు నెలల గర్భంతో ఉన్న నన్ను భర్త రోజూ కోరిక తీర్చాలంటూ బలవంతం చేసేవాడ‌ని చెప్పింది. ఎంత వారించినా వినిపించుకోకుండా లైంగిక దాడి చేసేవాడ‌ని.. ఈ క్ర‌మంలో తాను అనారోగ్యం పాల‌య్యాన‌ని తెలిపింది. లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆహారంలో విషం క‌లిపి భ‌ర్త‌కు పెట్టాన‌ని చెప్పింది. శ‌నివారం మైథిలిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Next Story