బాలికపై అత్యాచారం.. గర్భందాల్చడంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

Pregnant rape victim burnt alive in UP, three booked under POCSO. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కురవలి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం అత్యాచారానికి

By అంజి  Published on  9 Oct 2022 1:40 PM IST
బాలికపై అత్యాచారం.. గర్భందాల్చడంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కురవలి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం అత్యాచారానికి గురైన గర్భిణి బాలికను నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం అదే గ్రామంలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడని బాలిక తల్లి తెలిపింది. అయితే బాధితురాలు తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘటన గురించి వెల్లడించలేదు.

ఆ తర్వాత కొన్ని రోజులకు బాలిక తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. దీంతో బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చేసిన పరీక్షల్లో.. ఆమె గర్భవతి అని తేలడంతో పంచాయతీకి సమాచారం అందించారు. అక్టోబరు 6న జరిగిన పంచాయతీ సమావేశంలో బాలికకు, నిందితులకు వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నిందితుడి తల్లి బాధితురాలిని తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. గర్భిణిని సజీవదహనం చేసేందుకు నిందితుడి తల్లి ప్రయత్నించిందని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.

తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని మెయిన్‌పురిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించి, సైఫాయికి రిఫర్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 307, 376, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story