డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుగ్గొండి మండలంలోని మధిర గ్రామానికి చెందిన లావణ్య(24)కు నెక్కొండ మండలానికి చెందిన రాకేష్ రెడ్డితో గతేడాది పెళ్లైంది. ప్రస్తుతం లావణ్య ఏడు నెలల గర్భవతి. కాగా.. శనివారం లావణ్యకు నొప్పులు రావడంతో ఆమె అత్త రేణుక నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది.
చికిత్స అందించిన వైద్యుడు..నొప్పులు రావడం సహజమేనని ఏమీకాదని చెప్పారు. ఆదివారం ఉదయం మరోసారి నొప్పులు వచ్చాయి. కంగారు పడిన లావణ్య అత్త విషయాన్ని కంపౌండర్‌కు చెప్పింది. అతను ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే లావణ్య మృతి చెందింది. కాగా.. డాక్టర్ నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే తమ కోడలు మృతిచెందిందని లావణ్య అత్త ఆరోపించింది. ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. చివరికి రూ.4లక్షల పరిహారం చెల్లిస్తామని హాస్పిటల్యాజమాన్యం చెప్పడంతో ఆందోళన విరమించారు. డెడ్‌బాడీని మధిరకు తరలించారు.