తాను కోరిన కోరిక నెరవేరలేదని.. దేవుడిపై కోపం.. ఏం చేశాడంటే..?
Prayers not answered man vandalises temples in Indore.మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో దేవులన్నీ ఎక్కువగా
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2023 4:20 AM GMTమిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో దేవులన్నీ ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఏదైన కష్టం వస్తే దేవుడికి చెప్పుకుని తమకు ఓ పరిష్కార మార్గాన్ని చూపాలని కోరుకుంటారు. ఇలా చెప్పుకోవడంతో తమ కోరికలు నెరవేరాయని కొందరు చెబుతుంటారు. అయితే.. అందరి కోరికలు నెరవేరుతాయా అంటే చెప్పలేం. ఈ సంగతి కాస్త పక్కన బెడితే.. ఓ వ్యక్తి చిన్నప్పటి నుంచి దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా తన కష్టాన్ని దేవుడుకి చెప్పుకుని తన కష్టాన్ని దూరం చేయాలని ప్రార్థిస్తున్నాడు. అయితే.. ఆ కష్టం దూరం కాకపోవడంతో దేవుడిపై కోపం పెంచుకున్నాడు. రెండు ఆలయాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాల్యంలో ఓ వ్యక్తికి ప్రమాదంలో కన్ను దెబ్బతింది. అప్పటి నుంచి అతడు కన్ను బాగుచేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు అతడికి 24 ఏళ్లు. అయితే.. ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నప్పటికి తన కోరికను దేవుడు నెరవేర్చడం లేదని ఆగ్రహించిన ఆ వ్యక్తి చందన్ నగర్, ఛత్రిపురలోని రెండు దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఓ విగ్రహాన్ని అపవిత్రం చేశాడని పోలీసులు తెలిపారు.
అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ చౌబే తెలిపారు. అతడిపై ఐపీసీ 295ఏ(ఉద్దేశపూర్వకంగా మరియు హానికరమైన చర్యలు, మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా ఏ వర్గానికి చెందిన వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేసే ఉద్దేశ్యంతో) సెక్షన్ కింద కేసు నమోదు చేయబడిందన్నారు. సమస్య చాలా సున్నితమైనదని, లోతుగా విచారణ జరుగుతోందని చెప్పారు.