ఏపీలో షాకింగ్‌ ఘటన.. కాలేజీ వాష్‌రూమ్‌లో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని కొత్తపట్నంలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 16 ఏళ్ల విద్యార్థిని వాష్‌రూమ్‌లో పాపకు జన్మనిచ్చింది.

By అంజి  Published on  2 Aug 2024 1:31 PM IST
Prakasam district, Minor student, infant dies, APnews

ఏపీలో షాకింగ్‌ ఘటన.. కాలేజీ వాష్‌రూమ్‌లో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని కొత్తపట్నంలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 16 ఏళ్ల విద్యార్థిని వాష్‌రూమ్‌లో పాపకు జన్మనిచ్చిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన బుధవారం జరిగినప్పటికీ గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రసవం తర్వాత శిశువు మృతి చెందింది.

పాఠశాల సమయంలో విద్యార్థిని బాత్రూమ్‌కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చినట్లు నివేదికలు తెలిపాయి. బాత్రూమ్‌కు వెళ్లిన ఎంతకూ తిరిగి రాకపోవడంతో మహిళా టీచర్, కొంతమంది విద్యార్థులు బాత్రూమ్‌ దగ్గరికి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థి పక్కన చనిపోయిన శిశువును కనుగొన్నారు. వెంటనే ఆమెను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా చాలా గంటలుగా ప్రసవ నొప్పులు వచ్చినా ఎవరికీ చెప్పలేదు. ఆమె గర్భం దాల్చిన విషయం పాఠశాల అధికారులకు, ఉపాధ్యాయులకు తెలియలేదు.

విద్యార్థిని జూన్ 19న పాఠశాలలో చేరింది. క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతోంది. కొత్తపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఆమె గ్రామానికి చెందిన వ్యక్తి ఆమెను గర్భం దాల్చేలా చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

Next Story