మూడు రోజుల ప‌సికందును రూ.1.78ల‌క్ష‌ల‌కు అమ్మేసింది

Poverty-stricken woman sells 3 day old son for Rs 1.78 lakh.ఎన్ని క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికి కూడా క‌న్న బిడ్డ‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Nov 2021 9:06 AM GMT
మూడు రోజుల ప‌సికందును రూ.1.78ల‌క్ష‌ల‌కు అమ్మేసింది

ఎన్ని క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికి కూడా క‌న్న బిడ్డ‌ను వ‌దులుకునేందుకు ఏ త‌ల్లి సిద్ద‌ప‌డ‌దు. మాతృత్వ‌పు మాధుర్యం అలాంటిది. తాను తిన్నా తిన‌కున్నా కూడా.. త‌న బిడ్డ‌ల క‌డుపు నింపుతుంటుంది మాతృమూర్తి. అలాంటి మాతృమూర్తి క‌డు పేద‌రికం కార‌ణంగా.. ప‌సిబిడ్డ‌ను పోషించ‌లేక ఓ వ్య‌క్తికి రూ.1.78లక్ష‌ల‌కు విక్ర‌యించింది. ఈ ఘ‌టన మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాలోని షిర్డీలో వెలుగుచూసింది. న‌వంబ‌ర్ 7న థానేలోని డొంబివిలి ప‌ట్ట‌ణంలోని మ‌న్ప‌డ పోలీస్ స్టేష‌న్ స్టేష‌న్ లో న‌మోదైన ఎఫ్ఐఆర్ ప్ర‌కారం.. మ‌హిళ‌, బిడ్డ‌ను కొనుగోలు చేసిన వ్య‌క్తి, మ‌హిళ‌కు సాయం చేసిన మ‌రో న‌లుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. షిర్డీ ప‌ట్ట‌ణంలో 32 ఏళ్ల మ‌హిళ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. సెప్టెంబ‌ర్ నెల‌లో ఆమె మ‌గ‌శిశువ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే.. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోవ‌డంతో బిడ్డ‌ను చూసుకునేందుకు కూడా క‌ష్టంగా మారింది. దీంతో పాప‌ను విక్ర‌యించి కొంత సొమ్మును పొందాల‌ని బావించింది. ఈ క్ర‌మంలో బిడ్డ‌ను ఎవ‌రు కొంటారా అని వెత‌క‌సాగింది. ఈ క్ర‌మంలో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌, థానేకు చెందిన క‌ళ్యాణ్‌, ముంబైలోని ములుంద్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌ల సాయంతో ములుంద్‌లో నివ‌సించే వ్య‌క్తికి బిడ్డ‌ను రూ.1.78లక్ష‌ల‌కు విక్ర‌యించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంత‌రం న‌గ‌దు ఇవ్వ‌డంతో అత‌డికి బిడ్డ‌ను అప్ప‌గించేసింది.

పోలీసులు ప‌క్కా స‌మాచారంతో శిశువ‌ను కొన్న వ్య‌క్తి ఇంటిపై దాడి చేశారు. చిన్నారి తల్లిని, పసికందును కొనుగోలు చేసిన వ్యక్తిని, మరో ముగ్గురు మహిళలు, శిశువును విక్రయించడంలో సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story