మాదాపూర్‌ మహిళ హత్య కేసు.. అత్యాచారం చేసి హత్య చేశానన్న నిందితుడు

Police crack Madhapur woman murder case. హైదరాబాద్‌ నగర పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ దారుణ హత్య కేసును మాదాపూర్‌ పోలీసులు

By అంజి  Published on  23 Feb 2022 7:30 PM IST
మాదాపూర్‌ మహిళ హత్య కేసు.. అత్యాచారం చేసి హత్య చేశానన్న నిందితుడు

హైదరాబాద్‌ నగర పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ దారుణ హత్య కేసును మాదాపూర్‌ పోలీసులు చేధించారు. లాలు ప్రసాద్‌ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనకు దక్కకుండా వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటోందని యువతిపై నిందితుడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే యువతిని అత్యాచారం చేసి హత్య చేశాడు. బాధితురాలు నరేష్ అనే మరో యువకుడితో తిరుగుతోందని అక్కసు తోనే అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసు అధికారి తెలిపారు.

హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ దగ్గర ఉన్న అవుట్‌ పోస్టులోకి మహిళను తీసుకెళ్లి దారుణానికి ఒడి గట్టాడు. ఆ తర్వాత మహిళను నిందితుడు హత్య చేశాడు. మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు.


Next Story