కానిస్టేబుల్‌తో భార్య అశ్లీల వీడియో.. వాట్సాప్‌ గ్రూప్‌లో వైరల్‌.. అదే గ్రూప్‌లో భర్త కూడా..

Police constable suspended for sharing obscene video of colleagues wife. ఓ కానిస్టేబుల్.. మరొక పోలీసు భార్య అశ్లీల వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్ చేశాడు. ఆ తర్వాత అతనిని

By అంజి  Published on  7 Jan 2023 6:07 PM IST
కానిస్టేబుల్‌తో భార్య అశ్లీల వీడియో.. వాట్సాప్‌ గ్రూప్‌లో వైరల్‌.. అదే గ్రూప్‌లో భర్త కూడా..

ఓ కానిస్టేబుల్.. మరొక పోలీసు భార్య అశ్లీల వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్ చేశాడు. ఆ తర్వాత అతనిని ఉన్నతాధికారులు ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోను షేర్ చేసిన వ్యక్తి స్వయంగా అందులో కనిపిస్తుండగా, ఆ మహిళ మరో పోలీసు భార్య. ఈ ఘటన గురించి తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నిందితుడు అభిజీత్ పరాబ్.. ముంబై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. అతడు నో పొలిటికల్ మెసేజ్‌ అనే పేరు గల ఒక వాట్సాప్ గ్రూప్ తో సంబంధం కలిగి ఉన్నాడు. అందులో ప్రతిరోజూ అశ్లీల వీడియోలు వచ్చేవి. ఆ వాట్సాప్‌ బృందంలో మరికొందరు పోలీసులు కూడా ఉన్నారు. డిసెంబరు 9న పరబ్ తనతో పాటు మహిళతో కూడిన అశ్లీల వీడియోను వాట్సాప్‌లో షేర్‌ చేశాడు. దానిని ఇతరులతో పాటు గ్రూప్‌లో చేరిన ఇతర పోలీసులు చూశారు. వీడియో డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అసభ్యకరమైన వీడియోలో కానిస్టేబుల్ పరాబ్‌తో కనిపించిన మహిళ.. ఆ గ్రూప్‌లో ఉన్న మరో పోలీసు భార్య. ఇది చూసి ఆ పోలీసు షాక్ అయ్యాడు.

ఆ వెంటనే పోలీసు అతని భార్యను విచారించాడు. వాట్సాప్ గ్రూప్‌లో వీడియోను పంచుకోవడం ద్వారా పరాబ్ తన పరువు తీసినందుకు ఫిర్యాదు చేయమని ఆమెను కోరాడు. కానీ అతని భార్య అందుకు నిరాకరించింది. దీని తర్వాత, పోలీసు భార్య కుటుంబ సభ్యులను పిలిచి సతారాలోని ఆమె తల్లి ఇంటికి పంపించాడు. కానిస్టేబుల్ అభిజీత్ పరాబ్, భార్య.. నో పొలిటికల్ మెసేజ్ అనే వాట్సాప్ గ్రూప్‌లో వీడియో పంపిన మొబైల్ నంబర్‌పై ఆ పోలీసు డిసెంబర్ 9 న కేసు నమోదు చేశాడు. ఆ బృందంలో 126 మంది సభ్యులు ఉన్నారు.

ఈ వీడియో వల్ల తన పరువు పోయిందని పోలీసు ఆరోపించాడు. వీడియోలో అసభ్యకరమైన కంటెంట్ ఉన్నందున.. అసభ్యకరమైన అభ్యంతరకరమైన విషయాలను పంచుకున్నందుకు IPC సెక్షన్ 292, 293, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67A, IPC సెక్షన్ 500 కింద కేసు నమోదు చేయబడింది. బాధిత పోలీసు పరాబ్‌పై పరువు నష్టం కేసు కూడా పెట్టారు. దీని తరువాత, సీనియర్ పోలీసు అధికారులు కానిస్టేబుల్ పరబ్‌కు నోటీసు జారీ చేశారు. అతనిపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేశారు. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Next Story