హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మాదన్నపేట పీఎస్‌లో బానోత్ అభిలాష్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు తన కుటుంబంతో కలిసి మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని ముసారాంబాగ్ లో నివాసం ఉంటున్నాడు. నిన్న రాత్రి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. బ్లేడుతో గొంతు, చేతి మణికట్టు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత తలుపు కొట్టిన తీయకపోవడంతో అనుమానంతో వారు తలుపు బద్దలు కొట్టారు.
లోనికి వెళ్లి చూడగా.. అతడు రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. అభిలాష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్థారణ వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిని రెండు రోజుల క్రితం కోదాడలోని అత్తగారింట్లో వదిలిపెట్టి వచ్చాడు . మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.