జబర్దస్త్‌ నటుడు నవసందీప్‌ అరెస్ట్‌

జబర్దస్త్ కమెడియన్, సింగర్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని నవసందీప్‌ మోసం చేశాడు.

By అంజి
Published on : 25 Aug 2023 9:15 AM IST

Jabardasth Comedian, Nava Sandeep, Hyderabad

జబర్దస్త్‌ నటుడు నవసందీప్‌ అరెస్ట్‌

జబర్దస్త్ కమెడియన్, సింగర్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లోబర్చుకున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జబర్దస్త్ కమెడియన్ గాయకుడు నవ సందీప్‌కి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో నవ సందీప్ యువతికి మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. అప్పటి నుంచి ఆమె షేక్ పెట్‌లోని ఆల్ హమారా కాలనీలోని ఒక హాస్టల్లో నాలుగు సంవత్సరాలుగా ఉంటోంది. ఈ క్రమంలో నవ సందీప్ యువతకి పెళ్లి చేసుకుంటానంటూ పలుమార్లు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

అతని మాయమాటలు నమ్మిన ఆ యువతీ పలుమార్లు అతని చేతిలో బలి అయింది. ఇటీవల నవ సందీప్‌ను ఆ యువతి వివాహం విషయం అడగడంతో మొహం చాటేసాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి తొలుత గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన గోల్కొండ పోలీసులు.. ఆ కేసును మధురానగర్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించి ప్రేమ పేరుతో యువతని వంచించి లైంగికంగా వాడుకున్న ఆరోపణపై నవ సందీప్ ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

Next Story