కూక‌ట్‌ప‌ల్లిలో రేవ్ పార్టీ భ‌గ్నం.. 44 మంది స్వ‌లింగ సంప‌ర్కుల అరెస్ట్‌

Police bust rave party in Kukatpally 44 arrested.హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో రేవ్ పార్టీని స్పెష‌ల్ టాస్క్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 2:13 PM IST
కూక‌ట్‌ప‌ల్లిలో రేవ్ పార్టీ భ‌గ్నం.. 44 మంది స్వ‌లింగ సంప‌ర్కుల అరెస్ట్‌

హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో రేవ్ పార్టీని స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భ‌గ్నం చేశారు. కూకట్‌ప‌ల్లి వివేకానందనగర్ లోని ఓ ఇంటిపై దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులు 44 మంది యువ‌కుల‌తో పాటు ఇద్ద‌రు హిజ్రాల‌ను అదుపులోకి తీసుకున్నారు. శ‌నివారం రాత్రి వీరంతా మ‌ద్యం, హుక్కా సేవించి డ్యాన్సులు చేశారు. స్థానికుల స‌మాచారంతో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి పార్టీ నిర్వాహ‌కులైన ఇమ్రాన్, ద‌యాల్ ల‌ను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మ‌ద్యం బాటిల్స్‌, కండోమ్ ప్యాకెట్ల‌, హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

నెల‌కు రూ.30వేల‌కు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఇమ్రాన్, ద‌యాల్ లు వారంతంలో ఇలాంటి పార్టీలు నిర్వ‌హిస్తూ.. చుట్టు ప‌క్క‌ల వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లు స్థానికులు తెలిపారు. గ‌త రాత్రి కూడా హుక్కా పార్టీని నిర్వ‌హించారు. పార్టీకి హాజ‌ర‌య్యేందుకు రూ.300 చొప్పున వ‌సూలు చేశారు. మొత్తం 42 మంది యువ‌కులు ఆ పార్టీకి హాజ‌రయ్యారు. వీరంతా స్వ‌లింగ సంప‌ర్కులుగా తెలుస్తోంది. అధిక శ‌బ్దంతో చుట్టు ప‌క్క‌ల వారికి ఇబ్బందులు క‌లిగించ‌డంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ నిర్వాహ‌కుల‌తో పాటు హాజ‌రైన యువ‌కుల‌ను అదుపులోకి తీసుకుని కూక‌ట్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. నిర్వాహ‌కుల‌పై నిషేదిత హుక్కా వినియోగం పై కేసు న‌మోదు చేయ‌గా.. మిగిలిన వారిపై పెట్టి కేసులు పెట్టారు.

Next Story