ప్రియురాలు దారుణ హత్య.. రాత్రి హోటల్‌ రూమ్‌లో ఉండేందుకు నిరాకరించిందని

Police arrests man for killing girlfriend after she refused to stay overnight in hotel. హోటల్‌ రూమ్‌లో రాత్రి పూట తనతో ఉండటానికి నిరాకరించిందని ప్రియురాలిని దారుణ హత్య

By అంజి  Published on  27 Dec 2022 6:36 AM GMT
ప్రియురాలు దారుణ హత్య.. రాత్రి హోటల్‌ రూమ్‌లో ఉండేందుకు నిరాకరించిందని

హోటల్‌ రూమ్‌లో రాత్రి పూట తనతో ఉండటానికి నిరాకరించిందని ప్రియురాలిని దారుణ హత్య చేశాడో ప్రియుడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలిని హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. బాగ్‌పట్‌కు చెందిన రచన గౌతమ్‌ను ఘజియాబాద్‌లో తన ప్రియుడిని తరచుగా కలుసుకునేదని ఆమె భర్త రాజ్‌కుమార్ తెలిపారు. బాధితురాలు డిసెంబరు 25న ఘజియాబాద్‌లోని ఓ హోటల్‌లో తన ప్రియుడిని కలిసింది. అయితే త్వరగా ఇంటికి వెళ్దామని పట్టుబట్టింది. ప్రియుడు మాత్రం.. ఈ రాత్రి ఇక్కడే ఉండాలని కోరాడు. అందుకు ప్రియురాలు నిరాకరించడంతో గొంతు నులిమి చంపాడు.

మరుసటి రోజు.. హోటల్ సిబ్బంది గదికి చేరుకున్నప్పుడు, మహిళ నేలపై పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం ఇదే విషయమై పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు హోటల్‌లో ఉండటానికి ఇష్టపడని రచనను గొంతు నులిమి హత్య చేసినట్లు గౌతమ్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. తనకు, బాధితురాలికి గత మూడు నెలలుగా సంబంధం ఉందని కూడా అంగీకరించాడు. మృతురాలికి అప్పటికే వివాహం జరిగింది.

Next Story