లవ్‌టుడే సినిమాలో లాగే ఫోన్లు మార్చుకున్నారు.. ఏమైందంటే..?
Police Arrested a youth who changed his cell phone in Lovetoday movie style. సినిమాలో లాగానే ఫోన్లు మార్చుకుని ఒకరిని
By తోట వంశీ కుమార్ Published on 21 Jan 2023 2:45 PM ISTఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించారు. నిశ్చాతార్థం కూడా జరిగింది. ఇంకేముంది త్వరలో పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎన్నో కలలు కంటున్నారు. ఈ క్రమంలో లవ్ టుడే సినిమా చూశారు. ఆ సినిమాలో లాగానే ఫోన్లు మార్చుకుని ఇంకా ఒకరిని ఇంకొకరు బాగా అర్థం చేసుకోవాలని బావించారు. అనుకున్నదే తడవుగా ఫోన్లు మార్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఆ అబ్బాయి ఫోన్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు చూసి ఖంగుతిన్నది ప్రియురాలు. ఇంకేముంది సరాసరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడిపై కేసు పెట్టింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
సేలం జిల్లా వజప్పాడి బేలూరులోని మాతా కోయిల్ వీధికి చెందిన అరవింద్ ప్రైవేట్ అంబులెన్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం అతడికి వజపాడికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిశ్చాతార్థం కూడా చేసుకున్నారు. లవ్ టుడే సినిమాలో చూపించినట్లుగా ఫోన్ మార్చుకుని ఒకరిని ఇంకొకరు బాగా అర్థం చేసుకోవాలని బావించారు.
ఫోన్లు మార్చుకున్నారు. అరవింద్ సెల్‌ఫోన్‌ను తీసుకున్న ప్రియురాలు దానిని పరిశీలిస్తుండగా షాకింగ్ చిత్రాలు, వీడియోలు కనిపించాయి. అందులో పదో తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల విద్యార్థినితో అరవింద్ అశ్లీల వీడియో ఫుటేజీలు, ఫోటోగ్రాఫ్‌లు చూసి షాకైంది. ఆ తర్వాత విద్యార్థిని రక్షించాలనే ఉద్దేశంతో సంబంధిత విద్యార్థిని తల్లిదండ్రులను విషయం వివరించింది. ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి వజపాడి ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
పోలీసులకు వీడియో చూపించి తన ప్రియుడు అరవింద్‌పై కేసు పెట్టింది. ఫోక్సో కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరవింద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తనను మోసి అరవింద్ నిశ్చితార్థం చేసుకున్నాడని అతడి ప్రియురాలు తల్లిదండ్రులకు వివరించి పెళ్లిని రద్దు చేసుకుంది.