Vizag: 14 ఏళ్ల బాలికని గర్భవతిని చేసిన పీఈటీ అరెస్ట్

పాఠశాలలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేసిన కార్పోరేట్ పాఠశాలకు చెందిన 32 ఏళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) అరెస్ట్ అయ్యాడు.

By అంజి
Published on : 27 Feb 2024 7:52 AM IST

Physical education teacher, impregnating, minor student, Vizag

Vizag: 14 ఏళ్ల బాలికని గర్భవతిని చేసిన పీఈటీ అరెస్ట్ 

విశాఖపట్నం: పాఠశాలలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేసిన కార్పోరేట్ పాఠశాలకు చెందిన 32 ఏళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) అరెస్ట్ అయ్యాడు. విశాఖపట్నం నగరంలోని పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరగ్గా, వైద్య పరీక్షల నిమిత్తం తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తరలించగా.. బాలిక గర్భం దాల్చినట్టు సోమవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని బి దుర్గాప్రసాద్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు పాఠశాల ఆవరణలో ఆమెకు త్రోబాల్ కోచింగ్ ఇస్తూ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. జనవరిలో, బాలిక త్రోబాల్ ప్రాక్టీస్ కోసం పాఠశాలకు వెళ్లినప్పుడు, PET ఆమెను తన నివాసానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కోచింగ్ ముసుగులో బాధితురాలు ఉచ్చులో చిక్కుకుందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ జోన్) బి సునీల్ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం-2012 సంబంధిత సెక్షన్లు, ఐపీసీ 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఫిర్యాదు చేసిన కొన్ని గంటల తర్వాత అరెస్ట్ చేశామని తెలిపారు.

తదుపరి విచారణ నిమిత్తం కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనతో నగరంలోని మహిళా కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనను సోమవారం వివిధ మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులపై, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story