ఆ రెండు గదులను వాడుకుంటూ.. ప్రణీత్‌రావు ఏమి చేశారు?

ఎస్‌ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావును సస్పెండ్ చేసిన మరుసటి రోజే ప్రణీత్‌రావుతో పాటు గుర్తుతెలియని వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

By అంజి  Published on  11 March 2024 1:20 AM GMT
Phone tapping, ex sib dsp, praneet rao, Telangana

ఆ రెండు గదులను వాడుకుంటూ.. ప్రణీత్‌రావు ఏమి చేశారు?

ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి) లోని వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో నిక్షిప్తమై ఉన్న సున్నితమైన సమాచారాన్ని చెరిపివేసేందుకు ప్రయత్నించిన డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌రావును సస్పెండ్ చేసిన మరుసటి రోజే ప్రణీత్‌రావుతో పాటు గుర్తుతెలియని వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు 17 సిస్టమ్‌లతో ఉన్న ప్రత్యేక గది నుండి ఆపరేట్ చేయడం ద్వారా స్నూపింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రణీత్ కుమార్ ఎస్‌ఐబిలో పనిచేస్తున్నప్పుడు తన కోసం ప్రత్యేకంగా రెండు గదులను వాడుకుంటూ 17 సిస్టమ్స్‌ని ఆపరేట్ చేసేవాడని పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎస్‌ఐబీ అధికారులు తెలిపారు.

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రణీత్‌ రావు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డీ.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. సమాచారాన్ని వ్యక్తిగత పరికరాల్లోకి చేసుకున్నాక హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ హయాంలో ఎస్‌ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావుతో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఇటీవల కొన్ని రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు డిసెంబర్‌ 4న రాత్రి సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆఫ్‌ చేసి డేటాను ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, రికార్డు ధ్వంసం ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే ప్రణీత్ రావుని డీజీపీ రవిగుప్తా సస్పెండ్ చేశారు.

Next Story