కడప జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Pharmacy Student suspicious death in Kadapa.వైఎస్సార్‌ కడప జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2022 12:53 PM IST
కడప జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. కడపలోని ఫార్మసీ కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వసతి గదిలో చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. ఆమె మృతికి గత కారణాలు తెలియలేదు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థిని మృతికి సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు అందజేశారు. విద్యార్థిని మృతి పట్ల పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. విద్యార్థిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపణలు చేశారు.

హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకుకొని ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం చెబుతోంది. విద్యార్ధి ఆత్మహత్య స్థలాన్ని పరిశీలించి విద్యార్థిని తల్లితండ్రులతో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థిని అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story