డాక్టర్‌ని కత్తితో ఏడు సార్లు పొడిచిన కొడుకు.. సమర్థించిన తల్లి

చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్‌ని పేషెంట్ కొడుకు ఏడుసార్లు కత్తితో పొడిచిన ఒక రోజు తర్వాత, నిందితుడి తల్లి తన కుమారుడిని సమర్థిస్తూ మాట్లాడారు.

By అంజి  Published on  15 Nov 2024 9:06 AM IST
Patient, Chennai ,doctor , Crime

డాక్టర్‌ని కత్తితో ఏడు సార్లు పొడిచిన కొడుకు.. సమర్థించిన తల్లి

చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్‌ని పేషెంట్ కొడుకు ఏడుసార్లు కత్తితో పొడిచిన ఒక రోజు తర్వాత, నిందితుడి తల్లి తన కుమారుడిని సమర్థిస్తూ మాట్లాడారు. తనకు సరైన వైద్యం అందించనందుకే తన కుమారుడు విఘ్నేష్‌ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడని క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళ ఆరోపించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే దాడి జరిగిందని ఆమె ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ బాలాజీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది.

గతంలో వైద్యుల సంరక్షణలో ఉన్న తన తల్లికి సరైన చికిత్స అందించకపోవడంపై విసుగుతో నిందితుడు డాక్టర్ బాలాజీపై దాడికి పాల్పడ్డాడు. సంప్రదింపుల సమయంలో డాక్టర్ బాలాజీ తన వైపు కూడా చూడలేదు అని ఆమె ఆరోపించింది. "నా కొడుకు నాపై చాలా ప్రేమ కలిగి ఉన్నాడు, అతను కూడా హార్ట్ పేషెంట్, మూర్ఛతో బాధపడుతున్నాడు" అని తెలిపింది. విఘ్నేష్ తల్లి తన స్వంత రోగనిర్ధారణ గురించి తనకు తప్పుడు సమాచారం అందించిందని పేర్కొంది. ఆసుపత్రిలో నివేదించబడిన స్టేజ్ 5 క్యాన్సర్ నిర్ధారణ కంటే తనకు స్టేజ్ 2 క్యాన్సర్ ఉందని చెప్పబడింది.

Next Story