Rajanna Sircilla: దారుణం.. కూతురికి ఊరేసిన తల్లిదండ్రులు.. నిద్రలో ఉండగానే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను హత్య చేసిన దంపతులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

By అంజి  Published on  20 May 2024 3:06 PM IST
Rajanna Sircilla, murder, Crime news

Rajanna Sircilla: దారుణం.. కూతురికి ఊరేసిన తల్లిదండ్రులు.. నిద్రలో ఉండగానే.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను హత్య చేసిన దంపతులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరెళ్లకు చెందిన చెప్యాల నర్సయ్య(49), అతని భార్య ఎల్లవ్వ(43)లు తమ కుమార్తె ప్రియాంక(24)ని హత్య చేసి సహజ మరణమని పేర్కొన్నారు. ఆ మహిళ కొన్నేళ్లుగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెకు వైద్యం చేయించి వివాహం జరిపించారు. ఆమెకు 13 నెలల కుమారుడు ఉన్నాడు.

మళ్లీ మానసిక రోగం తిరగబెట్టడంతో ఆ మహిళకు మళ్లీ చికిత్స అందించి, స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి తీసుకెళ్‌లి అక్కడే మూడు రోజులు ఉంచినా ఏ మాత్రం ప్రయోజనం లేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు ఆమె జీవితాన్ని అంతం చేయాలని ప్లాన్ చేశారు. మే 14న ఆమె తమ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారు ఆమెను తాడుతో ఉరివేసి చంపారని పోలీసు అధికారి తెలిపారు. మృతి చెందిన విషయాన్ని తమ అల్లుడికి తెలియజేసి మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.

మహిళ మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో దంపతులు నేరం అంగీకరించారు. దంపతులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని, తదుపరి విచారణ జరుగుతోందని మహాజన్ తెలిపారు.

Next Story