కడపలో ఘోరం.. చిన్నారి గొంతు కోసి హత్య చేసిన తల్లిదండ్రులు
Parents kills daughter in Kadapa District.విచక్షణ కోల్పోయిన దంపతులు లోకం ఎరుగని చిన్నారిని
By తోట వంశీ కుమార్ Published on
26 Jan 2023 5:04 AM GMT

దంపతుల మధ్యలో గొడవలు సహజం. అయితే.. ఆ సమయంలో కొందరు సహనం కోల్పోయి కోపంతో చేసే పనులు వివాదాలకు దారి తీయడంతో పాటు ఒక్కొక్కసారి వారి ప్రాణాలు లేదా ఎదుటి వారి ప్రాణాలు తీసే వరకు వెలుతుంటాయి. ఆ క్షణంలో దంపతులు తీసుకునే నిర్ణయాలు వారి చిన్నారుల పట్ల శాపాలుగా మారుతున్నాయి. విచక్షణ కోల్పోయిన దంపతులు లోకం ఎరుగని చిన్నారిని పొట్టన బెట్టుకున్నారు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
పెండ్లిమర్రి మండలం మాచునూరులో నివసిస్తున్న దంపతులు తమ ఎనిమిదేళ్ల చిన్నారి గొంతు కోసి పరారు అయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యా భర్తల గొడవలే ఈ హత్యకు కారణమని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story