చిత్తూరు జిల్లాలో దారుణం.. మూఢనమ్మకాలతో ఇద్దరు కుమార్తెల హత్య

Parents assassination two children.ఆ దంప‌తులిద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులు. పిల్ల‌ల‌కు విద్యాబుద్దులు నేర్పే వృత్తిలో ఉన్నారు. అయితే.. మూఢ‌న‌మ్మ‌కాల‌తో త‌మ ఇద్ద‌రు కుమారైల‌ను దారుణంగా హ‌త్య చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2021 4:58 AM GMT
Parents assassination two children

ఆ దంప‌తులిద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులు. పిల్ల‌ల‌కు విద్యాబుద్దులు నేర్పే వృత్తిలో ఉన్నారు. అయితే.. మూఢ‌న‌మ్మ‌కాల‌తో త‌మ ఇద్ద‌రు కుమారైల‌ను దారుణంగా హ‌త్య చేశారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌రిగిన ఈ దారుణం వెనుక విస్త‌పోయే విష‌యాలెన్నో బ‌య‌ట‌ప‌డ్డాయి. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ద‌న‌ప‌ల్లెలో పురుషోత్తం నాయుడు, ప‌ద్మ‌జ దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి అలేఖ్య‌(27), సాయి దివ్య‌(22) ఇద్ద‌రు కుమారైలు.

పురుషోత్తం నాయుడు ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ కాగా, పద్మజ మాస్టర్‌ మైండ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ప‌నిచేస్తున్నారు. అలేఖ్య బోపాల్‌లో పీజీ చేస్తుండ‌గా.. చిన్న‌కుమారై బీబీఏ పూర్తి చేసి రెహ‌మాన్ మ్యూజిక్ అకాడ‌మీలో సంగీతం నేర్చుకుంటోంది. కొన్నాళ్లుగా స్థానికులు ఎవరితో కలవడకుండా ఒంటరిగా ఉంటున్న కుటుంబసభ్యులు. మూఢభక్తి పెంచుకున్నారు. త‌ర‌చుగా ఇంట్లో పూజ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజ‌లు నిర్వ‌హించారు. మొద‌ట చిన్న కుమారైను శూలంతో పొడిచి చంపేశారు.

అనంత‌రం పెద్ద కుమారై అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హ‌త్య‌చేశారు. అనంత‌రం త‌ల్లిదండ్రుల అరుపులు, కేక‌ల‌తో విష‌యం వెలుగు చూసింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. మా పిల్లల్ని మేం బతికించుకుంటాం.. ఇద్దరూ లేచివస్తారు.. ఒక్కరోజు సమయం ఇవ్వండి అని.. ఆ తల్లిదండ్రులు పోలీసులను చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Next Story
Share it