దారుణం.. మైనర్ కూతురిపై తండ్రి అత్యాచారం.. తల్లి సహకారంతోనే..
Parents arrested for raping minor daughter in Uttarkhand. ఉత్తరాఖండ్‌లో మానవ సంబంధాలను దెబ్బతీసే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 25 Dec 2022 12:01 PM ISTఉత్తరాఖండ్‌లో మానవ సంబంధాలను దెబ్బతీసే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తండ్రి తన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేశాడు. కన్న కూతురిపై ఇంత దారుణమైన నేరం జరగడం చూసి ఆ తల్లి కూడా మౌనం వహించి తన మైనర్ కూతురిని కాపాడకుండా భర్తకు సాయం చేసింది. ఈ కేసులో నిందితులైన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్‌లో, మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికతో తండ్రి బలవంతంగా లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి భార్య అంటే బాధితురాలి తల్లి కూడా బాలికకు సపోర్ట్ ఇవ్వకపోవడం బాధకరం. కాశీపూర్ సీఓ వందనా వర్మ ఈ మొత్తం విషయాన్ని వెల్లడించారు.
మైనర్ బాలికపై శారీరక వేధింపులు: కాశీపూర్ గడ్డ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను భార్యతో కలిసి శారీరకంగా వేధిస్తున్నట్లు కవిత బుటోలా సెంటర్ నిర్వాహకురాలు సఖి వన్ స్టాప్ సెంటర్ రుద్రాపూర్‌కు సెప్టెంబర్ 1న ఫిర్యాదు అందిందని సీఓ వందన వర్మ తెలిపారు. నిందితుడు బాధితురాలి సవతి తండ్రి.
పోక్సో చట్టం కింద దంపతులపై కేసు నమోదు: మైనర్ బాలిక మాట్లాడుతూ.. తన సవతి తండ్రి తనను లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడని, తాను వద్దని చెప్పినప్పుడు కొట్టాడని తెలిపింది. అంతేకాదు బాధితురాలు తండ్రి చేష్టలను తల్లికి చెప్పగా.. కూతురికి ఆసరాగా ఉండకుండా నిందితుడైన భర్తకు అండగా నిలిచింది. ఫిర్యాదు మేరకు నిందితుల జంటపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి దంపతులు పరారీలో ఉండడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ జంట ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో తలదాచుకున్నారు. కుందేశ్వరి పోలీస్ స్టేషన్ సురేంద్ర సింగ్ నిందితుడు తండ్రి కాశీపూర్ నుండి, తల్లిని ఢిల్లీ నుండి అరెస్టు చేశారు.