కుటుంబంలోని నలుగురు ఆడవాళ్లను చంపేశాడు.. చెప్పింది ఇదే!!
ఒక పాకిస్తానీ వ్యక్తి తన తల్లి, సోదరితో సహా తన కుటుంబంలోని ఇంకో ఇద్దరు ఆడవాళ్లను అత్యంత కిరాతకంగా చంపేశాడు.
By అంజి Published on 22 Oct 2024 9:40 AM ISTకుటుంబంలోని నలుగురు ఆడవాళ్లను చంపేశాడు.. చెప్పింది ఇదే!!
ఒక పాకిస్తానీ వ్యక్తి తన తల్లి, సోదరితో సహా తన కుటుంబంలోని ఇంకో ఇద్దరు ఆడవాళ్లను అత్యంత కిరాతకంగా చంపేశాడు. వారి జీవనశైలి సరిగా లేదని, విపరీతంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ఉండడంతో వారిని చంపినట్లు పోలీసులతో ఒప్పుకున్నాడు. బిలాల్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తన తల్లి, సోదరి, మేనకోడలు తన వివాహ జీవితాన్ని నాశనం చేశారని, అందుకే వారి గొంతులను కోసినట్లు కోర్టులో తెలిపాడు. కరాచీలోని ఓల్డ్ సోల్జర్ బజార్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నలుగురు మహిళల మృతదేహాలు గొంతు కోసిన స్థితిలో కనిపించాయి.
బిలాల్ ప్రతిరోజూ సొంత ఇంట్లోని మహిళలతో గొడవలు పడేవాడని, అతని భార్య మతపరమైన భావాలు ఉన్నది కావడంతో అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయిందని ఆరోపించాడు. తన కుటుంబంలోని మహిళల ఉదారవాద జీవనశైలి కారణంగానే భార్య వెళ్లిపోయిందని ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నందుకు నలుగురు మహిళలపై బిలాల్ కోపం పెంచుకున్నాడు. తన సోదరి, మేనకోడలు సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేసినందుకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదట్లో కేవలం తన సోదరికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అయితే ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులెవరినీ వదిలిపెట్టకూడదని నలుగురినీ చంపేశానని బిలాల్ పోలీసులకు తెలిపాడు.