వేటలో విషాదం.. జింకకు బదులు ఫ్రెండ్‌ని కాల్చి చంపాడు

తమిళనాడులోని జవాది హిల్స్‌లో జింకపై గురిపెట్టి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ తన స్నేహితుడిని కాల్చి చంపాడు.

By అంజి  Published on  15 Nov 2023 8:05 AM IST
hunting, Tamil Nadu,  deer, Crime news

వేటలో విషాదం.. జింకకు బదులు ఫ్రెండ్‌ని కాల్చి చంపాడు

తమిళనాడులోని జవాది హిల్స్‌లో జింకపై గురిపెట్టి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ తన స్నేహితుడిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. దీపావళి సందర్భంగా జింకను అక్రమంగా వేటాడి తినేందుకు జమునమరత్తూరుకు చెందిన శక్తివేల్, ప్రకాష్, శక్తివాసన్ కొండల పరిధిలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల్లో ఒకరు జింకను లక్ష్యంగా చేసుకుంటుండగా, బుల్లెట్ శక్తివేల్‌కు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాష్ ముఖానికి గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శక్తివేల్ బంధువులు పోలీసులకు లేదా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఖననం చేయడానికి ప్రయత్నించారు. అయితే, జమునమరతుర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story