యాప్‌లో ఈ లొకేషన్‌కు రమ్మంటారు.. వెళ్లిన వాళ్ళను..!
స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఓ ముఠా కలకలం రేపుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు
యాప్‌లో ఈ లొకేషన్‌కు రమ్మంటారు.. వెళ్లిన వాళ్ళను..!
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఓ ముఠా కలకలం రేపుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు బాధితులు ఈ గ్యాంగ్‌తో ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాన్ని బయట పెట్టారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మొదటి ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో నివాసం ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సంబంధించింది. ప్రముఖ గే డేటింగ్ యాప్ గ్రిండర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, అతడికి ఆగస్టు 1న ఓ ప్రొఫైల్ కనిపించిందని, ఆ ప్రొఫైల్‌లోని వ్యక్తి బంజారాహిల్స్‌లోని భోలానగర్‌గా తన లొకేషన్‌ను షేర్ చేసుకున్నాడు. బాధితుడు సదరు వ్యక్తిని నిర్దేశిత ప్రదేశంలో కలవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. అక్కడికి చేరుకోగానే ఆ వ్యక్తి కత్తితో బాధితుడిని బెదిరించి బట్టలు విప్పమని బెదిరించాడు. వీడియోలు తీసి ఆ వ్యక్తి బాధితుడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వెండి కంకణం, వెండి గొలుసు, రూ.2000 నగదును లాక్కుని ఎత్తుకెళ్లాడు. అతను తప్పించుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇదే విధమైన సంఘటన మరో వ్యక్తికి కూడా ఎదురైంది. ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలో నివసిస్తున్న 27 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి కూడా అలాంటి ముఠా చేతిలో వేధింపులను ఎదుర్కొన్నాడు. అదే రోజు వేరే సమయంలో, డేటింగ్ యాప్‌ని ఉపయోగించి.. బంజారాహిల్స్‌లోని భోలానగర్ లొకేషన్‌కు రప్పించాడు. 27 ఏళ్ల యువకుడు కూడా హింసకు గురయ్యాడు. కత్తులతో బెదిరించి.. భయపెట్టాడు. వారి బెదిరింపులకు లొంగి బాధితుడు తన బంగారు ఉంగరం, రూ.7 వేల నగదు ఇవ్వాల్సి వచ్చింది. అదనంగా, నిందితులు అతని ఫోన్‌ను దొంగిలించి, ఫోన్‌పే ద్వారా రూ. 20,000 ఖాతాకు బదిలీ చేశారు. ఇద్దరు బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు IPC సెక్షన్ 392 కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు