విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వసతిగృహంలో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటువేసింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కురపాంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయంలో రోజులాగే భోజనం అనంతరం విద్యార్థులు నిద్రపోయారు. అయితే.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ ఓ విషస్పరం వసతి గృహంలోకి వచ్చింది. అర్థరాత్రి ఒంట గంట సమయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్‌లను కాటు వేసింది. ఈ విషయం గుర్తించిన సిబ్బంది ముగ్గురు విద్యార్థులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కాగా.. చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ మంతిని రంజిత్ మృతి చెందినట్లుగా సమాచారం. మిగిలిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. మరొకరి పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేశ్ కుమార్ ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. జేసీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆస్పత్రి వద్దకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు.