అంత్యక్రియలకు వెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

పాట్నాలోని మానేర్‌లో అంత్యక్రియలకు ప్రజలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ 20 అడుగుల లోతైన గొయ్యిలోకి బోల్తా పడిన

By అంజి  Published on  20 April 2023 5:55 AM GMT
Patna, road accident,  Maner, Breaking news

అంత్యక్రియలకు వెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

పాట్నాలోని మానేర్‌లో అంత్యక్రియలకు ప్రజలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ 20 అడుగుల లోతైన గొయ్యిలోకి బోల్తా పడిన ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన 20 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు ట్రాక్టర్‌పై వెళ్తున్న గోపాల్‌పూర్‌కు చెందిన ప్రమోద్‌కుమార్‌ అలియాస్‌ బుగల్‌గా గుర్తించారు. అంత్యక్రియల కోసం ప్రజలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ గోపాల్‌పూర్ నుంచి లోదీపూర్ గంగా ఘాట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చీకటి పడడంతో ట్రాక్టర్ అదుపు తప్పి మానేరు బ్యాంకు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన 15 నుంచి 20 అడుగుల లోతులో ఉన్న గుంతలోకి బోల్తా పడింది. సమాచారం అందుకున్న మానేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను దానాపూర్, బిహ్తా, మానేర్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story