ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన కారు.. మ‌హిళ దుర్మ‌ర‌ణం

One died Nine injured in a road accident on Rajiv Rahadari.సిద్దిపేట జిల్లా కొడకండ్ల గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2021 12:05 PM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన కారు.. మ‌హిళ దుర్మ‌ర‌ణం

సిద్దిపేట జిల్లా కొడకండ్ల గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు ప్యాసింజర్ ఆటోను ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో తొమ్మిది మంది ప్రయాణికులకు తీవ్ర‌గాయాలు అయ్యాయి. కుకునూర్‌పల్లి ఎస్‌ఐ తెలిపిన వివరాల మేర‌కు.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన వెంకటేశాచారి అనే వ్యక్తి కారులో హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా అదే మార్గంలో వెళ్తున్న ప్యాసింజర్‌ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ అక్కడికక్క‌డే మృతి చెందింది. మ‌రో 9 మందికి తీవ్ర‌గాయాలు అయ్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను గజ్వేల్‌ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతురాలిని సంగారెడ్డి జిల్లా అందోలుకు చెందిన నాగ‌మ‌ణి(51) గా గుర్తించారు. అందోల్‌కు చెందిన ఓ కుటుంబం కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి వారిని ద‌ర్శించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే ప్రమాదానికి కారణమని బావిస్తున్న‌ట్లు తెలిపారు.

Next Story