ఏడాదిన్నర బాలిక మృతదేహంపై అత్యాచారం

గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో తంగర్ ప్రాంతంలో ఒకటిన్నర సంవత్సరాల బాలిక మృత దేహంపై అత్యాచారం జరిగింది.

By అంజి  Published on  27 Feb 2023 2:45 PM IST
ఏడాదిన్నర బాలిక మృతదేహంపై అత్యాచారం

గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తంగర్ ప్రాంతంలో ఒకటిన్నర సంవత్సరాల బాలిక మృత దేహంపై అత్యాచారం జరిగింది. సమాచారం ప్రకారం.. చిన్నారికి పుట్టినప్పటి నుండి గుండెలో రంధ్రం ఉంది. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 25న బాలిక మృతి చెందింది. అదే రోజు చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. అయితే మరుసటి రోజు బంధువులు బాలిక మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి చేరుకుని చూడగా మృతదేహం మట్టిపై వివస్త్రగా పడి ఉంది. ఫిబ్రవరి 26న మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి చేరుకున్నామని, అక్కడి దృశ్యాన్ని చూసి చలించిపోయామని బాలిక తండ్రి తెలిపాడు.

బాలిక మృతదేహం మట్టిపై పడి ఉంది. బాలిక శరీరంపై ఒక్క గుడ్డ కూడా లేదు. దీంతో బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై అత్యాచారం జరిగిందనే భయంతో బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు మృత దేహాన్ని పోస్టుమార్టంకు పంపగా.. మృతదేహంతో అత్యాచారం జరిగే అవకాశం కూడా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. అదే సమయంలో ఇంత నీచమైన పని చేసిన వ్యక్తి ఎవరో తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గతంలో బొటాడ్ నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది. భగవాన్‌పరా ప్రాంతంలోని నిర్జన ప్రదేశంలో బాలిక మృతదేహం కనుగొనబడింది. ఆ తర్వాత స్థానిక ప్రజలు పోలీస్ స్టేషన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. నేరస్థుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిని దిగ్బంధించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి 39 ఏళ్ల డైమండ్ పాలిషర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహర్షి రావల్ మాట్లాడుతూ.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని, హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలిందని చెప్పారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Next Story