దారుణం.. తండ్రిని చంపి.. సవతి తల్లిపై అత్యాచారం

ఒడిశాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  8 March 2023 12:36 PM IST
Odisha youth , Crime news

దారుణం.. తండ్రిని చంపి.. సవతి తల్లిపై అత్యాచారం (ప్రతీకాత్మకచిత్రం)

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిందితుడు తన తండ్రితో కలిసి జీవించేందుకు సవతి తల్లి అనుమతించకపోవడంతో మరో గ్రామంలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

ఆదివారం రాత్రి నిందితుడు తన తండ్రి ఇంటికి వెళ్లగా.. అతడితో సవతి తల్లి గొడవకు దిగిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో యువకుడికి కోపం వచ్చింది. ఈ క్రమంలోనే యువకుడి తండ్రితో కూడా వాగ్వాదం మొదలైంది. దీని తర్వాత, యువకుడు తన 65 ఏళ్ల తండ్రిని పదునైన ఆయుధంతో చంపాడు. తండ్రి హత్య తర్వాత ఆ యువకుడు తన సవతి తల్లిపై అత్యాచారం చేసి ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు టోమ్కా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే పాత్ర తెలిపారు.

'సవతి తల్లి తండ్రితో కలిసి జీవించనివ్వలేదు'

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. హత్య, అత్యాచార ఘటన చోటుచేసుకుందని, ఈ ఘటన వెనుక ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు వీలుగా నిందితుడిని పోలీసులు కఠినంగా విచారిస్తున్నారు. నిందితుడైన యువకుడిని తన తండ్రితో కలిసి జీవించేందుకు సవతి తల్లి అనుమతించ లేదు. ఈ విషయంపై యువకుడికి కోపం వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీరియస్ గా విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.

Next Story