భార్య మృతిని త‌ట్టుకోలేక‌.. ఆమె చితిలో దూకిన భ‌ర్త‌

Odisha 65 year old man jumps into wife's funeral pyre.స‌తీస‌హ‌గ‌మ‌నం.. సతి అంటే భార్య. సహగమనం అంటే కలసి,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2021 8:01 AM GMT
భార్య మృతిని త‌ట్టుకోలేక‌.. ఆమె చితిలో దూకిన భ‌ర్త‌

స‌తీస‌హ‌గ‌మ‌నం.. సతి అంటే భార్య. సహగమనం అంటే కలసి, పోవటం. చనిపోయిన భ‌ర్త‌తో పాటు భార్యకూడ చనిపోవటాన్ని సతీ సహగమనము అని పేరు. ఒక‌ప్పుడు ఈ ఆచారం ఉండేది. కాల‌క్ర‌మంలో ఈ దురాచారాన్ని నిషేదించారు. అయితే.. తాజాగా ఒడిశాలో ప‌తిస‌హ‌గ‌మ‌నం జ‌రిగింది. అత‌డికి భార్య అంటే అమిత‌మైన ప్రేమ. ఇక భార్య లేదనే నిజాన్ని అత‌డు త‌ట్టుకోలేక‌పోయాడు. తాను ఒంటరి వాడిన‌న్న భావ‌న అత‌డిలో క‌లిగింది. భార్య‌తో పాటే తాను త‌నువు చాలించాల‌ని భావించాడు. అనుకున్న‌ట్లుగానే భార్య చితిలో దూకేశాడు. ఈ ఘ‌ట‌న ఒడిశా జిల్లా గోల‌ముండా స‌మితిలోని శైలుజోడి గ్రామంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. శైలుజోడి గ్రామంలో నీల‌మ‌ణి శ‌బ‌ర‌(65) ,రాయ‌బారి(60), దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి న‌లుగురు కుమారులు సంతానం. కాగా.. మంగ‌ళ‌వారం రాయ‌బారి గుండెపోటుతో క‌న్నుమూసింది. అంత్య‌క్రియ‌ల నిమిత్తం.. భ‌ర్త గ్రామ‌స్తుల‌తో క‌లిసి శ్మశానికి మృత‌దేహాన్ని తీసుకెళ్లాడు. అక్క‌డ చితిపేర్చి రాయ‌బ‌రి మృత‌దేహానికి నిప్పుపెట్టాడు. ఇక అంద‌రూ ఇళ్ల‌కు బ‌య‌లు దేరాడు. అంద‌రితో పాటు కొద్ది దూరం న‌డుచుకుంటూ వ‌చ్చాడు నీల‌మ‌ణి. అయితే..భార్య లేని జీవితం త‌న‌కు ఎందుకు అనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. వెన‌క్కి తిరిగి ప‌రుగున వెళ్లి భార్య చితిలో దూకాడు. అంద‌రూ చూస్తుండ‌గా.. భార్య మృత‌దేహంతో పాటు సజీవ‌ద‌హ‌నం అయ్యాడు. ఈ ఘ‌ట‌న అక్క‌డ ఉన్న వారంద‌రిని క‌లిచి వేసింది.

Next Story
Share it